Dailyhunt
ఢిల్లీ యూనివర్సీటీల్లో అన్ని పరీక్షలు రద్దు

ఢిల్లీ యూనివర్సీటీల్లో అన్ని పరీక్షలు రద్దు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండటంతో యూనివర్సిటీ విద్యార్థుల పరీక్షలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ స్టేట్ యూనివర్సిటీల పరిధిలోని వివిధ కోర్సులలో ఫైనల్ ఇయర్ సహా అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యూనివర్సిటీలు నిర్ణయించిన మూల్యాంకన ప్రమాణాల ప్రకారం విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana