న్యూఢిల్లీ: ఢిల్లీ నగరంలోని బుద్ధ విహార్ ప్రాంతంలోని ఓ ఇంట్లో శనివారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ఒక్కసారిగా ఇంట్లో మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక శాఖ అధికారులు ఐదు వాహనాలతో హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పుతున్నారు. ఈ అగ్నిప్రమాదంలో ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు, ఓ అగ్నిమాపక శాఖ జవాన్ గాయపడ్డారు.గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అసలు అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. ఢిల్లీ పోలీసులు కూడా సంఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు.

