Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఢిల్లీలో వర్క్ ఫ్రం హోమ్..మండే మెట్రో

ఢిల్లీలో వర్క్ ఫ్రం హోమ్..మండే మెట్రో

వతెలంగాణ-హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ, ప్రజా రవాణా వినియోగంపై కేంద్ర ప్రభుత్వం (Central Govt) దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం (Delhi Govt) కీలక నిర్ణయం తీసుకుంది.

ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, ఇంధన వినియోగాన్ని నియంత్రించడం లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం ఉద్యోగులకు వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం రేపటి నుంచే అమల్లోకి వస్తుందని సీఎం రేఖా గుప్తా ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానం వల్ల ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వాహనాల సంఖ్య తగ్గి, కాలుష్య నియంత్రణకు తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, ఉన్నతాధికారులు ప్రతి సోమవారం తప్పనిసరిగా ఢిల్లీ మెట్రోలోనే ప్రయాణించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిని 'మండే మెట్రో' పేరుతో ప్రత్యేక కార్యక్రమంగా అమలు చేయనున్నారు. ఈ నిర్ణయం ద్వారా ప్రజారవాణా వినియోగాన్ని ప్రోత్సహించడమే కాకుండా, ట్రాఫిక్ రద్దీ తగ్గించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana