Dailyhunt
డిసెంబర్ 4 నుండి భారీ వర్షాలు..

డిసెంబర్ 4 నుండి భారీ వర్షాలు..

హైదరాబాద్ : దేశంలో ఓ వైపు కరోనా విజృంభణ కొనసాగుతుంటే.. మరో వైపు వరణుడు భయపెడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం నివర్ తుఫాన్ వల్ల ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. నివర్ ధాటికి రెండు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీగా పంట నష్టం ఏర్పడింది. తాజాగా బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ బురివీ వల్ల ఈ నెల 4వ తేదీ నుండి తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు.

భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ఎఫ్ బృందాలకు రాష్ట్రాలకు చేరుకున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana