Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దివ్యాంగురాలి భర్త అనుమానాస్పద మృతి..

దివ్యాంగురాలి భర్త అనుమానాస్పద మృతి..

కారకులను కఠినంగా శిక్షించాలి: వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీమ్ డిమాండ్ నవతెలంగాణ-వర్ధన్నపేట
వర్ధన్నపేట మండలంలో మండలానికి చెందిన దివ్యాంగురాలైన బిర్రు హైమావతి భర్త అనుమానాస్పదంగా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని, కారకురాలైన వారిపై చర్య తీసుకోవాలని వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీమ్ డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో దివ్యాంగురాలు బిరు హైమావతిని ఆదివారం ఆయన పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దివ్యాంగురాలు భర్త వివాదాస్పదంగా ఉరివేసుకొని మృతి చెందినట్లు తెలిపారు. దివ్యాంగురాలికి జరిగిన అన్యాయంపై వారు వివరాలు వెల్లడించారు.

వర్ధన్నపేట నల్లబెల్లి గ్రామంలో దివ్యాంగురాలైన బిర్రు హైమావతి, ఈమె పుట్టుకతో 100% దివ్యాంగురాలు, బిర్రు హైమావతిని తొర్రూరు మండలం కర్కాల గ్రామానికి చెందిన సంకినేని సుధాకర్ ఈనెల 13న వివాహం చేసుకున్నట్లు తెలిపారు. 14న నల్లబెల్లిలో జరిగిన వేడుకలలో ఇరు కుటుంబ సభ్యులు కలిసి సంతోషంగా ఉన్నారని, 16వ తేదీన తొర్రూరు కర్కాల గ్రామంలోని తన నివాసంలో శనివారం ఉదయం తెల్లవారుజామున సుధాకర్ ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఉన్నట్లు తెలిపారు. ఆత్మహత్య హత్య అనే వివరాలు ఇంకా తేలలేదని, మృతికి కారకులైన వారిని గుర్తించి శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

భర్త మృతి అనుమానాస్పదంగా ఉందని దివ్యాంగురాలికి అన్యాయం జరగడంపై దివ్యాంగ సమాజం ఆమెకు మద్దతు నిలుస్తున్నారన్నారని రాష్ట్ర వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీమ్ తెలిపారు. మృతికి కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని లేనిచో దివ్యాంగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు బండి చక్రపాణి, జిల్లా సహాయ కార్యదర్శి ఎండి సాదిక్, ఆకులపల్లి రమేష్, దేవర రాజు, బర్ల జనార్ధన్, బరిపట్ల బాబు, మందపురి అశోక్, సింగారం రజిత, మాదాసి స్వప్న, బిర్రు సుగుణ, అమరోజు స్వామి మొదలగు వారు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana