Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దుబ్బాకకు బలగాలు పంపండి: సీఈసీకి కోమటిరెడ్డి లేఖ

దుబ్బాకకు బలగాలు పంపండి: సీఈసీకి కోమటిరెడ్డి లేఖ

హైదరాబాద్: కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. దుబ్బాకకు కేంద్ర బలగాలను పంపాలని లేఖలో కోరారు. ఉప ఎన్నికలను స్వేచ్ఛగా.. పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు అక్రమ మార్గంలో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్ధి బంధువు ఇంట్లో డబ్బులు దొరికాయని గుర్తుచేశారు. ఇక మంత్రి హరీశ్ రావు తన అధికారాన్ని ఉపయోగించి ప్రత్యర్థి పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దుబ్బాకలో ప్రతి మండలానికి కనీసం ఒక కేంద్ర పరిశీలకుడిని పంపాలని, రాష్ట్ర పోలీసులు, జిల్లా అధికారులను తక్షణమే దుబ్బాక నుంచి తరలించాలని లేఖలో కోమటిరెడ్డి కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana