నవతెలంగాణ - హైదరాబాద్ : మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని రామంతాపూర్ గ్రామ శివారులో ఎండల వేడిమికి తట్టుకోలేక శుక్రవారం క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు మృతిచెందారు.
నాగోల్ల భాను (16), జాల నందకిశోర్ (17) మరికొంతమందితో కలిసి క్వారీ గుంతలో స్నానానికి వెళ్లిన వీరు, నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

