Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈతకు వెళ్లి యువకుడు మృతి

ఈతకు వెళ్లి యువకుడు మృతి

వతెలంగాణ-చందుర్తిఈతకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బండపల్లి గ్రామానికి చెందిన మాల్యాల సృజన్ (18) ఈత సరద కోసం ఊర చెరువు లోకి మధ్యాహ్నం వెళ్ళాడు.

ఈ క్రమంలో నీటిలో చాలా లోతులోకి వెళ్ళి, నీటిలో మునిగి పోయాడు. స్థానికులు గమనించి కాపాడే లోగా అప్పటికే మృతి చెందినట్లుగా గుర్తించారు. ఈ ఘటన పై మృతుని తండ్రి నర్సయ్య పిర్యాదు మేరకు ఎస్సై రమేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana