Dailyhunt
ఈతరం ప్రీ వెడ్డింగ్కి ప్రతీకగా..

ఈతరం ప్రీ వెడ్డింగ్కి ప్రతీకగా..

రుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్తో కలిసి 'గాయపడ్డ సింహం'తో అలరించబోతున్నారు.ఈ చిత్రాన్ని పవన్ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజరు కష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు.

ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'బ్రైడ్ సాంగ్'ను విడుదల చేశారు.
ఈ లేటెస్ట్ సింగిల్ను ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్ మూడ్ను ఫ్రెష్గా, ఫన్తో నింపేలా రూపొందించారు.
సంగీత దర్శకుడు స్వీకర్ ట్రెండీ బీట్స్తో పాటు ఫెస్టివ్ ఫ్లేవర్ను అద్భుతంగా మేళవించారు. ఆయన పాడిన ఇంగ్లీష్ పార్ట్స్, శ్రీమణి రాసిన ఎనర్జిటిక్ తెలుగు లైన్స్ కలిసి ఈ పాటకు కూల్, కాంటెంపరరీ టచ్ను ఇచ్చాయి. ఈ సినిమా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana