నవతెలంగాణ-ఆలేరు టౌన్ రెడ్లని అసభ్యకర వ్యాఖ్యలతో దూషించిన చింతపండు నవీన్ ,అలియాస్ తిన్నార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆలేరు పట్టణంలో రెడ్ల సంఘం మహిళ ప్రధాన కార్యదర్శి జాలపు వనజ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ హెచ్ ఓ ఉదయ్ కిరణ్ కి ఫిర్యాదు చేశారు.
చింతపండు నవీన్ (తిన్నార్ మల్లన్న) వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనంతుల ఎల్లారెడ్డి, జాలపు రాంరెడ్డి, జాలపు సిద్దారెడ్డి, శేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

