Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

వతెలంగాణ - జుక్కల్ జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆదేశాల మేరకు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.

సందర్భంగా జుక్కల్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ దేశాయ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ పటేల్ ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సమగ్రత, శాంతి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడని స్మరించుకున్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతిని దేశవ్యాప్తంగా 'ఉగ్రవాద వ్యతిరేక దినం'గా పాటిస్తున్న సందర్భంగా ప్రతి భారతీయుడు హింసకు వ్యతిరేకంగా నిలబడి, శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.

సమైక్యతే మన శక్తి - శాంతియుత భారతమే మన లక్ష్యం అన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల్ సర్పంచ్ సావిత్రి సాయగౌడ్ , సొసైటీ చైర్మన్ శివనంద్ , పెద్దగుళ్ల సర్పంచ్ మాధవరావు దేశాయ్ , ఖండేబల్లూర్ సర్పంచ్ కృష్ణ , నాగలగావ్ సర్పంచ్ జాదవ్ సునంద బాబురావు పటేల్ , చిన్నగులా సర్పంచ్ జ్ఞానేశ్వర్ పటేల్ , ఖండేబల్లూర్ సర్పంచ్ చాకలి కృష్ణ, కత్తల్ వాడి సర్పంచ్ గోపాలరావు, దోస్తు పల్లి సర్పంచ్ మారుతి, సోపూర్ సర్పంచ్ తుకారం, కాంగ్రెస్ నాయకులు నల్లవార్ ప్రసాద్, సురేష్ గొండ , సుధాకర్ తదితర పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana