Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎంపీ నామ ఓదార్పు

ఎంపీ నామ ఓదార్పు

నవ తెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
టిఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు నామ నాగేశ్వరరావు ఖమ్మంలో పలు కుటుంబాలను గురువారం పరామర్శించారు. 34వ డివజన్‌లో మైన్స్‌ మినరల్‌ కమిషనర్‌ మల్సూర్‌ మాతృమూర్తి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వీడీవోస్‌ కాలనీలో కనకమేడల గోపాలకృష్ణమూర్తి కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీనగర్‌ కాలనీలో ఇటీవల విదేశాలలో మరణించిన విద్యార్ధి జంగాల రాకేష్‌ కుటుంబాన్ని డీసీసీబీ ఛైర్మన్‌ కురాకుల నాగభూషయ్య, కార్పొరేటర్‌ కొత్తపల్లి నీరజలతో కలిసి పరామర్శించారు. రోటరీ నగర్‌లో అనుమోలు రాధాకుమారి కుటుంబ సభ్యులను, సుందరయ్య నగర్‌లో ఆలశ్యం రంగయ్య కుటుంబాన్ని ఓదార్చారు.

నూతన వధూవరులకు ఆశీర్వాదం
బల్లేపల్లికి చెందిన పద్మనాభుని ప్రసాదరావు, సత్యలక్ష్మిల కుమారుడు నాగ విక్రమ్‌, లావణ్య నూతన దంపతులను నామ ఆశీర్వదించారు. చింతకాని మండలం టీఆర్‌ఎస్‌ నాయకులు తాతా ప్రసాద్‌ కుమార్తె ఎంగేజ్‌మెంట్‌ ఖమ్మం స్వర్ణభారతీ కళ్యాణ మండపంలో జరిగింది. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. కూసుమంచి మండలం కేశవపురం గ్రామానికి చెందిన తాళ్లూరి విష్ణుమూర్తి కుమారుని వివాహం సందర్భంగా ఆశీర్వదించారు. నామ వెంట డెప్యూటీ మేయర్‌ బత్తుల మురళి, 34వ డివిజన్‌ కార్పొరేటర్‌ గుండపనేని నాగేశ్వరరావు, 3వ డివజన్‌ కార్పొరేటర్‌ కొనకంచి సరళ , టీఆర్‌ఎస్‌ నాయకులు మద్ధినేని బేబి స్వర్ణకుమారి, తుళ్లూరు బ్రహ్మయ్య, క్యాంప్‌ కార్యాలయ ఇంచార్జి కనకమేడల సత్యనారాయణ, ఖమ్మం రూరల్‌ మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్‌, బాణాల వెంకటేశ్వర్లు, చిత్తారు సింహాద్రి యాదవ్‌, గొల్లపూడి హరికృష్ణ, నామ సేవ సమితి సభ్యులు పాల్వంచ రాజేష్‌, చీకటి రాంబాబు, తాళ్లూరి హరీష్‌, కృష్ణ ప్రసాద్‌, మోరంపూడి సాయికృష్ణ తదితరులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana