Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్ఆర్ఈజీఎస్ తో లింక్ రోడ్డు పనులు ప్రారంభం

ఎన్ఆర్ఈజీఎస్ తో లింక్ రోడ్డు పనులు ప్రారంభం

వతెలంగాణ-రామారెడ్డిమండలంలోని గొడుగు మర్రి తాండ గ్రామపంచాయతీ పరిధిలో గల నాలుగు తండాలను కలుపుతూ, లింక్ రోడ్డు పనులను సర్పంచ్ సలావత్ రవి నాయక్, పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు.

సోమవారం రవి నాయక్ మాట్లాడుతూ.. పంచాయతీ పరిధిలో గల నాలుగు తాండాలు ఒక తాండ నుంచి మరొక తాండకు, గ్రామపంచాయతీకి రావాలంటే చాలా దూరం నుండి తిరిగి రావాల్సిన పరిస్థితి ఉందని, దూరాన్ని తగ్గిస్తూ, తాండ వాసుల రవాణా సౌకర్యార్థం, లింకు రోడ్డు పనులను తాండవాసుల సహకారంతో పనులు ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకర్, పాలకవర్గ సభ్యులు లక్ష్మీ రాజు, సరిత సేవ్య, సవిత శ్రీరామ్, ఏమి సీతయ్య, పంతులు గణేష్, తాండ పెద్ద మనుషులు రాముల, పూజారి రాజు మహారాజు, బాలు, శంకర్, సంధ్య గోపాల్, సంతోష్, లచ్చు పంచాయతీ కార్యదర్శి గణేష్ తదితరులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana