Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్నికల గుర్తులపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

ఎన్నికల గుర్తులపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

హైదరాబాద్ : ఎన్నికల గుర్తులను సవరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర పార్టీలకు శాశ్వత గుర్తులు కేటాయించింది.

అలాగే గుర్తింపు లేని పార్టీల కోసం కేటాయించే ఫ్రీ సింబల్స్‌ విషయంలో ఎన్నికల సంఘం కొన్ని ఆంక్షలను విధించింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లో పలు గుర్తులను ఉపయోగించకుండా ఉండేలా చర్యలు తీసుకుంటూ తాజా ఉత్తర్వులు జారీచేసింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆటోరిక్షా, టోపీ, ఇస్త్రీపెట్టె, ట్రక్కు గుర్తులను వినియోగించుకోకుండా ఆంక్షలు విధించింది. ఈ గుర్తులను ఏపీ, తెలంగాణ మినహా దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. అలాగే జనసేనకు కేటాయించిన గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్స్‌ కేటగిరీలో ఉంచింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana