హోం
ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి : ఎస్ఈసీ ఆదేశం

హైదరాబాద్ : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కీలక సూచనలు చేశారు. గతాన్ని మరిచిపోయి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో అలసత్వాన్ని సహించబోమని హెచ్చరించారు. ఓటింగ్ పర్యవేక్షణకు ప్రత్యేకంగా యాప్ రూపొందిస్తున్నట్టు రమేశ్ కుమార్ తెలిపారు. ఈ యాప్ ద్వారా వీడియోలు, ఫొటోలను అప్‌లోడ్ చేయవచ్చన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వలంటీర్లను ఎంతమాత్రమూ వినియోగించవద్దని, వారు కనుక ప్రచార కార్యక్రమంలో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏకగ్రీవాలు అయ్యే పంచాయతీల్లో అక్రమాలు జరిగినట్టు నిర్దారణ అయితే ఆర్వో, ఏఆర్వోలపై చర్యలు తప్పవని ఎస్‌ఈసీ హెచ్చరించారు.