Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫారెస్ట్ లో పూర్తయిన మట్టి రోడ్డు

ఫారెస్ట్ లో పూర్తయిన మట్టి రోడ్డు

తిరనున్న ప్రయాణికుల దశాబ్దాల కోరికనవతెలంగాణ - మల్హర్ రావు

మండలంలోని కిషన్ రావుపల్లి నుంచి ఆటవిమార్గం గుండా భూపాలపల్లి జిల్లా కేంద్రం వరకు ఎప్పుడెప్పుడాని దశాబ్దాల కోరిక తీరేందుకు ఏళ్లుగా ఎదురుచున్న పారెస్ట్ లో మట్టి రోడ్డు పూర్తియింది.దీంతో భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లాల ప్రయాణికులు వేతలు తిరడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మంథని నియోజకవర్గంలోని భూపాలపల్లి, పెద్దపల్లి రెండు జిల్లాల సరిహద్దుల్లో ఖమ్మంపల్లి-తాడిచెర్ల మానేరుపై ఇటీవల బ్రిడ్జి పూర్తియిన విషయం తెలిసిందే.అయితే తాడిచెర్ల మానేరు బ్రిడ్జి నుంచి కిషన్ రావు పల్లి వరకు సెంట్రల్ లైటింగ్ తోపాటు తారు రోడ్డు సైతం త్వరలోనే మంజూపై పనులు ప్రారంభం కానున్నట్లుగా ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది.

కిషన్ రావు పల్లె నుండి అటవీ ప్రాంతం నుంచి భూపాలపల్లికి మట్టి రోడ్డు పూర్తి అయ్యింది. దీంతో పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లా ప్రయాణికులకు, రైతులకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.రాష్ట్ర ఐటీ,అసెంబ్లీ వ్యవహారాలు, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టితో దశబ్దాల రోడ్డు పనులు ప్రారంభం కావడంతో మంథని, ముత్తారం, మల్హర్ మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మంథని పట్టణం నుంచి భూపాలపల్లి దాదాపు 60 కిలోమీటర్ల దూరం ఉండడంతో ప్రయాణం ప్రయాణికులకు ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మంథని, ఖమ్మంపల్లి మీదుగా తాడిచర్ల, పెద్దతుండ్ల, కిషన్ రావుపల్లె మీదుగా అటవీ ప్రాంతం నుండి నేరుగా భూపాలపల్లికి 40 కిలోమీటర్ల తక్కువ సమయంలో చేరుకోవచ్చు.దీంతో దాదాపు ప్రయాణికులకు 20 కిలోమీటర్ల మేర ప్రయాణం భారం తగ్గనుంది.కిషన్ రావు పల్లి నుంచి అటవీ శాఖ అనుమతులు తీసుకువచ్చి, రోడ్డు మంజూరు చేసిన మంత్రి శ్రీధర్ బాబుకు రెండు జిల్లాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana