Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫర్టిలైజర్, విత్తన దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

ఫర్టిలైజర్, విత్తన దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

- స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కుల పరిశీలననవతెలంగాణ - ఉప్పునుంతల

ప్పునుంతల మండల కేంద్రంలో శుక్రవారం మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్,విత్తన దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీలలో మండల వ్యవసాయ అధికారి కొర్ర రమేష్ పాల్గొని దుకాణాల్లో ఉన్న ఎరువులు, విత్తనాల నిల్వలను పరిశీలించారు. ప్రతి డీలర్ వద్ద తప్పనిసరిగా స్టాక్ బోర్డులు ప్రదర్శించాలనీ, రైతులకు విక్రయించే ప్రతి సరుకుకు బిల్లు ఇవ్వాలని సూచించారు. అలాగే స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అన్నది తనిఖీ చేశారు. రిజిస్టర్లలో నమోదు చేసిన నిల్వలు, దుకాణాల్లో భౌతికంగా ఉన్న స్టాక్ పరిమాణం సరిపోతుందా లేదా అన్న విషయాన్ని పరిశీలించినట్లు తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. నకిలీ విత్తనాలు, అధిక ధరలకు విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana