Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
FCRA సవరణ బిల్లుపై విపక్షాల ఆందోళన

FCRA సవరణ బిల్లుపై విపక్షాల ఆందోళన

వతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం' (FCRA) సవరణ బిల్లును రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఉభయ సభలు ఉదయం వాయిదా పడిన తర్వాత లోక్సభ సమావేశాలు తిరిగి మూడు గంటలకు ప్రారంభమైయ్యాయి. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ FCRA పై తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ వేణు గోపాల్ లోక్ సభలో FCRAను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మైనార్టీలే లక్ష్యంగా సదురు బిల్లును రూపొందించారని ఆయన మండిపడ్డారు. బిల్లుపై అనేక లోపాలు ఉన్నాయని, విపక్షాలు సందేహాలు లెవనెత్తిన మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ఈ క్రమంలోనే విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం' (FCRA) సవరణ బిల్లును బుధవారం నాడు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) పరిశీలనకు అధికారికంగా పంపుతున్నట్లు స్పీకర్ తెలియజేశారు. మరోవైపు ప్రతిపక్షాల ఆందోళన మధ్యలోనే మైన్స్ అండ్ మినరల్స్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana