Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫిట్ అండ్ యాక్టివ్ 2కే రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే జారె

ఫిట్ అండ్ యాక్టివ్ 2కే రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే జారె

వతెలంగాణ - అశ్వారావుపేటఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా సోమవారం అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రం, దమ్మపేట మండల కేంద్రాల్లో 'ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ 2 కే రన్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక యువత, విద్యార్థులు, పోలీస్ శాఖ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, క్రీడాభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పరుగెత్తారు.

అనంతరం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో వ్యాయామం, నడక, క్రీడలను భాగం చేసుకోవాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకపల్లి వీరభద్రరావు, మున్సిపల్ కమిషనర్, అశ్వారావుపేట,దమ్మపేట ఎంపీడీవో లు రామ కోటా రెడ్డి,రవీందర్ రెడ్డి లు,ఎంఈఓ ప్రసాదరావు, ఎస్ఐ లు యయాతి రాజు,సాయి కిశోర్ రెడ్డి,మండల అధ్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ, కక్కిరాల రమేష్, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు తుమ్మ రాంబాబు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు జూపల్లి కోదండ వెంకట రామారావు, దమ్మపేట మండల అధ్యక్షుడు కాకా రమేష్, రేమల్ల కేదార్నాథ్,దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana