Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా..

ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా..

వన్ కళ్యాణ్ బత్తుల హీరోగా బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు 'పురుష:' సినిమాను నిర్మించారు. వీరు వులవల దర్శకత్వం వహించారు.ఈ మూవీని ఈనెల 22న రిలీజ్ చేయబోతున్నారు.

సినిమా ప్రమోషన్స్లో భాగంగా హీరో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ,'మాది పల్నాడులోని మాచర్ల దగ్గర్లోని కారంపూడి. మాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి రిలేషన్ లేదు. మా నాన్న కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు. నన్ను హీరో చేయాలన్నది మా నాన్న కల.

నాక్కూడా సినిమాలంటే చాలా ఇష్టం. వైజాగ్లో సత్యానంద్ వద్ద యాక్టింగ్లో శిక్షణ తీసుకున్నాను. డీఓపీ సతీష్ వల్లే ఈ ప్రాజెక్ట్ మా దగ్గరకు వచ్చింది. సినిమాలతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాలని అనుకున్నాం.

అందుకే నా మొదటి మూవీగా ఇలాంటి ఓ ఫ్యామిలీ కథతో వస్తున్నాను. ఫ్యామిలీ ఆడియెన్స్కి నచ్చేలా ఈ మూవీని రూపొందించాం. ఓ మంచి చిత్రాన్ని చూశామన్న ఫీలింగ్తో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వెళ్తారు. ఇందులో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులున్నారు.

సప్తగిరి, కసిరెడ్డి ప్రతీ ఒక్క విషయంలో హెల్ప్ చేశారు. 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' సినిమాని ఆడియెన్స్ ఎంతో ఎంజాయ్ చేశారు. మా సినిమా కూడా అన్ని వర్గాల ఆడియెన్స్ని ఆకట్టుకుంటుంది. దర్శకుడు వీరు ఇచ్చిన సహకారంతోనే సినిమాని బాగా చేయగలిగాను` అని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana