Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గల్ఫ్ నుంచి నేరుగా భారత్కు ఇంధన సరఫరా!

గల్ఫ్ నుంచి నేరుగా భారత్కు ఇంధన సరఫరా!

వతెలంగాణ-హైదరాబాద్ : హర్మూజ్ జలసంధిలో ఇంధన సరఫరా సవాళ్లను అధిగమించేందుకు భారత ప్రభుత్వం ఒమన్ నుంచి గుజరాత్ కు సహజవాయువును తరలించే 'మిడిల్ ఈస్ట్-ఇండియా డీప్వాటర్ పైప్లైన్ (MEIDP)' ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోస్తోంది.

గెయిల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ వంటి సంస్థలకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించింది. హర్మూజ్ జలసంధి మూసివేతతో భారత్ ఇంధన భద్రతకు ముప్పు వాటిల్లడంతో, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సంబంధం లేకుండా నిరంతరాయ ఇంధన సరఫరా కోసం ఈ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana