Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గర్ల్ ఫ్రెండ్ అంటే బానిస కాదు..

గర్ల్ ఫ్రెండ్ అంటే బానిస కాదు..

ప్రముఖ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు మరో మారు మెగాఫోన్ పట్టు కున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందు తున్న చిత్రం 'లలిత`. ఈ సినిమాను కాస్మిక్ పవర్ క్రియేట్స్ ఎల్.ఎల్.పి.

బ్యానర్పై పి. సుధీర్ రాజు, డి. వైష్ణవి నేహా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో నందిని హీరోయిన్గా, అభిలాష్ పీలా, అఖిల్ వివాన్ హీరోలుగా పరిచయమవుతున్నారు.

ఈ చిత్రానికి సంగీతాన్ని మ్యూజి కల్ డ్యుయో మణి, నాగరాజు సమకూరుస్తున్నారు. తన విశ్వాసం, వ్యక్తిత్వం కోసం నిలబడే ఓ మహిళ కథగా రూపొందుతున్న ఈ సామాజిక నేపథ్య చిత్రానికి 'గర్ల్ఫ్రెండ్ అంటే బానిస కాదు…' అనే క్యాప్షన్ అందరిలోనూ మరింత ఆసక్తి కలిగిస్తోంది. రఘు బాబు, పృథ్వీ రాజ్, తాగు బోతు రమేష్, డీడీ శ్రీనివాస్, వి. ఝాన్సీ మేఘనా, సురేష్ దామర పల్లి, శ్రీవాణి త్రిపురనేని, జయశ్రీ రాచకొండ, మహేంద్రనాథ్, కిరణ్ కళ్యాణ్ కొండ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana