Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గెలుపెవరిదో..?

గెలుపెవరిదో..?

పాకిస్తాన్ లక్ష్యం 457,ప్రస్తుతం316/7 బంగ్లాదేశ్ తో రెండో,చివరి టెస్ట్

సైహేట్(బంగ్లాదేశ్): బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో,చివరి టెస్ట్ లో విజయం ఇరుజట్లను ఊరిస్తోంది.

457పరుగుల భారీ లక్ష్యంతో నాల్గో రోజు ఆటను కొనసాగించిన పాకిస్తాన్ జట్టు మంగళవారం ఆట నిలిచే సమయానికి 7వికెట్ల నష్టానికి 316పరుగులు చేసింది.వికెట్ కీపర్,మహ్మద్ రిజ్వాన్(71)క్రీజ్ లో ఉన్నాడు.భారీ ఛేదనలో భాగంగా పాకిస్తాన్ ఓపెనర్లు ఫజల్(6),అజాన్(21)నిరాశపరిచారు.ఆ తర్వాత కెప్టెన్ షాన్ మసూద్(71),బాబర్ అజామ్(47)ఇన్నింగ్స్ ను కుదుట పరిచారు.ఆ తర్వాత ఆదుకుంటాడనుకున్న సౌద్ షకీల్(6)నిరాశపరిచాడు.ఈ క్రమంలో అఘా సల్మాన్(71)స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ తో ఆదుకున్నాడు.బంగ్లాదేశ్ బౌలర్లు తైజిల్ ఇస్లామ్ కు నాలుగు,నహిద్ రాణా కు రెండు,మెహిదీ హసన్ కు ఒక వికెట్ దక్కాయి.చివరిరోజైన బుధవారం పాకిస్తాన్ మరో 121పరుగులు చేయాల్సి ఉండగా..మరో మూడు వికెట్లు పడగొడితే బంగ్లాదేశ్ కు విజయం ఖాయం కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana