Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భవ దినోత్సవం

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భవ దినోత్సవం

ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తుళ్ల వెంకన్న నవతెలంగాణ-నెల్లికుదురు

మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించినట్లు మండల అధ్యక్షుడు తుళ్ళ వెంకన్న, మండల ఇన్చార్జి పోలేపాక ప్రవీణ్ తెలిపారు.

ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎప్పుడురస్కరించుకొని ఎమ్మార్పీఎస్ జెండాను మంగళవారం ఎగరవేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకను పురస్రించుకొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు మాదిగ జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన భారతదేశ సామాజిక ఉద్యమాల ఉపాధ్యాయుడు,మాదిగ జాతి భవిష్యత్తు మార్గ నిర్దేశకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అని కొనియాడారు, మంద కృష్ణ మాదిగ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వంగాల ఈశ్వర్, ఉపాధ్యక్షులు తుళ్ళ చిన్న వెంకన్న, మాజీ వైస్ ఎంపీపీ జల్ల వెంకటేష్, హెచ్ అశోక్, హెచ్ మహేందర్, దండంపల్లి సైదులు, సారంగం, హెచ్ రవి, బొల్లంపల్లి మల్లయ్య, తుళ్ళ మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana