Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఘనంగా సీఐటీయూ 56వ ఆవిర్భావ వేడుకలు

ఘనంగా సీఐటీయూ 56వ ఆవిర్భావ వేడుకలు

వతెలంగాణ - కంఠేశ్వర్ : సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ధర్నా చౌకు వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో యూనియన్ జెండాను వివిధ రంగాల కార్మికులు కలిసి ఎగురవేసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసి వేడుకలను నిర్వహించారు. ముందుగా సీఐటీయూ జెండాను జిల్లా ఉపాధ్యక్షులు మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రాజు ఎగరవేయడం జరిగింది. అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. 1970 జూన్ 30న కార్మిక వర్గం ఐక్య పోరాటాలను నిర్వహించడం కొరకు తమ హక్కుల సాధనకు సమస్యల పోరాటాల వైపు కార్మిక వర్గాన్ని కదిలించడం కొరకు సిఐటియు ఆవిర్భవించిందని నాటి నుండి నేటి వరకు 17 సార్లు దేశవ్యాప్త సమ్మేలు నిర్వహించి కార్మిక వర్గా ఐక్యతను చాటడం జరిగిందని ,ఐక్య పోరాటాల మూలంగా అనేక హక్కులను సాధించుకున్నారని. కానీ నేటి పాలకులు బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడులను తీసుకురావడం జరిగిందని ,దీని మూలంగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు హరించబడతాయని, అందువల్ల భవిష్యత్తులో సమరశీల ఐక్య పోరాటాలను కార్మిక వర్గం నిర్వహించాల్సిన అవసరం ఉందని ,అందుకు కార్మికులు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

అనేకమంది కార్మిక నాయకులు కార్మికులు జీవితాలను త్యాగం చేసి చట్టాలను సాధిస్తే. ప్రభుత్వం వాటిని రద్దు చేయటం శోచనీయమని, అందువల్ల వాటి పునరుద్ధరణకు సంఘటిత పోరాటాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు .ఈ కార్యక్రమంలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నాయకులు అంగన్వాడి జిల్లా ప్రధాన కార్యదర్శి పి.స్వర్ణ మున్సిపల్ యూనియన్ లిఫ్ట్ ఇరిగేషన్ యూనియన్ నాయకులు రమేష్, సిఐటియు నగర నాయకులు నరసయ్య, అంజయ్య, రాజు, సూచిత తదితరులతోపాటు ఆయా రంగాల కార్మికులు పాల్గొన్నారు. అనంతరం సారంగాపూర్ సీడ్ కార్పొరేషన్ హమాలీ కార్మికులు సిఐటియులో చేరటంతో కార్పొరేషన్ ఎదుట వారికి కండువాలు కప్పి యూనియన్ లోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు దస్తగిరి, లక్ష్మణ్,అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు వారితో కలిసి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు, జెండాను ఎగరవేయడం జరిగింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana