Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

వతెలంగాణ - మర్రిగూడ : మండలంలోని ఇందుర్తి గ్రామంలో శనివారం సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పగిళ్ల రామచంద్రం సీఐటీయూ జెండా ఎగురవేసిన అనంతరం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ సీఐటీయూ పోరాటాల స్ఫూర్తితో కార్మికుల హక్కుల సాధన కోసం ముందుకెళ్తామని,కార్మిక ఐక్యతను వెలిగెత్తి చాటి చెప్పి దోపిడి పీడన లేని కార్మిక వర్గ రాజ్యంపై పోరాటాలు చేస్తామని అన్నారు.

దేశంలో కార్మిక రాజ్యం వచ్చినప్పుడే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని, నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దుచేసి కార్మికులకు 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని,సమాన పనికి సమాన వేతనం అనే దానిపై కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు ఏరుకొండ రాఘవేంద్ర, చేపూరి సుధాకర్, కొలుగూరి శీను, రమావత్ రాజు నాయక్, మాడుగుల శ్రీను, ఊరు పక్క వెంకటయ్య, పోతరాజు కృష్ణయ్య, ఊరు పక్క నరసింహ, శంకర్, పవన్, లింగం, అనూష తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana