Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

వతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన రాయగిరి పరిధిలోని మసు కుంటలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలం ఆరేగూడెం గ్రామానికి చెందిన బరిగెల నవనీత (51) భర్త నరసింహులుతో కలిసి బైక్ మీద భువనగిరిలో క్రాకర్ షాప్ వెళ్తుండగా..

అదే సమయంలో రాయగిరి నుంచి భువనగిరికి వస్తున్న టిప్పర్ డ్రైవర్ అతివేగంగా అజాగ్రతతో నడుపుతూ బైకును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బైక్ నుంచి ఇద్దరు కిందపడిపోయారు. వెనక కూర్చున్న నవనీత తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. నరసింహులుకు చేతులకు, ఎముకలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా చికిత్స నిమిషం జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతని కుమారుడు బరిగెల భాను ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్లు భువనగిరి ఎస్హెచ్ఓ ఏం అనిల్ కుమార్ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana