Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గోదావరి పరివాహక 
ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ చర్యలు

గోదావరి పరివాహక 
ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ చర్యలు

​వరదలపై ముందస్తు చర్యలులోతట్టు ప్రాంత ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

​గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ చర్యలు చేపడుతున్నట్టు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు.

శనివారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నది వరద ప్రవాహాన్ని మంత్రి సీతక్క.. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వస్సల్ టోప్పోలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండ్రోజులు గా తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగుతుండడంతో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీఓ, సాగునీటి, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితి ని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. రెండేండ్లు ములుగు జిల్లాలో ప్రత్యేక వరద నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసి వాగులు, గోదావరి పరివాహక ప్రాంతాలు, ముంపు గ్రామాల్లో ప్రత్యేక అధికారులను నియమించి పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నామని వివరించారు. గోదావరి మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకున్నప్పటికీ తీసుకున్న ముందస్తు చర్యల కారణంగా ఎలాంటి నష్టం జరగలేదన్నారు.

రెండు నెలల కింద గోదావరి పరివాహక ప్రాంతాల్లో జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్ర తినిధులతో కలిసి పర్యటించి అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. గతంలో రామన్నగూడెంలోకి వరద నీరు చేరేదని, ఈసారి ముందస్తు చర్యలతో ఆ ప్రమాదాన్ని నివారించగలిగామన్నారు. రామన్నగూడెం, మంగపేట ప్రాంతాల్లో కరకట్ట నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభంకాగా సుమారు 800 మీటర్ల మేర పనులు పూర్తయ్యాయని తెలిపారు. వరదలు, వాగులు ఉప్పొంగిన సమయంలో ప్రజలు వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వర్షాల సమయంలో అడవుల్లోకి పశువులను మేపేందుకు వెళ్లడం, చేపల వేటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. 2022, 2023లో గోదావరి, జంపన్నవాగు వరదల వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మిగిలిన కరకట్ట పనులనూ పూర్తి చేసి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ కల్పిస్తామని సీతక్క తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుం బాలను గుర్తించి రెండో విడతలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగా రం ఏఎస్పీ మనన్భట్, గ్రంధాల య సంస్థ చైర్మెన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఆర్డీవో కృష్ణవేణి, తహసీల్దార్, ఎంపీడీఓ, స్థానిక ప్రజాప్రతినిధు లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

​వరద బాధితులకు 
అర్హతనుబట్టి ఇందిరమ్మ ఇండ్లుమంగపేట మండలంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క గోదావరి ముంపు ప్రాంతాలను, కరకట్ట పనులను శనివారం సందర్శించారు. అనంతరం మండల కేంద్రంలో వరద ముంపు బాధితులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి వారితో ముచ్చటించారు. ప్రభుత్వం అన్నిఏర ్పాట్లు చేస్తుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వరదముంపు ప్రాంతంలో నివాసం లేని అర్హులైన వారికి వచ్చే విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉందనీ, ఎటువంటి ఇబ్బంది ఉన్నా అధికారులకు సమాచారం అందించాలన్నారు. సరదాగా ఈతకు వెళ్లడం వంటివి చేసి అపాయం కొని తెచ్చుకోవద్దని తెలిపారు. కార్యక్రమంలో బానోత్ రవిచందర్, గుమ్మడి సోమయ్య, డీపీఓ వెంకటయ్య, తహసీల్దార్ తోట రవీందర్, ఎంపీడీఓ బంధ్రునాయక్, వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ​​

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana