Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గొప్పగా ఆదరిస్తున్నారు

గొప్పగా ఆదరిస్తున్నారు

శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, ఏ+ ఎస్ మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్ల మీద చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన చిత్రం 'రావు బహదూర్'.

జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో వచ్చిన ఈ సినిమాకి వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. సత్యదేవ్, దీపా థామస్ జంటగా నటించారు.
ఈ చిత్రాన్ని ఇటీవల రిలీజ్ చేశారు. సినిమా సక్సెస్ ఫుల్గా రన్ అవుతున్న నేపథ్యంలో సక్సెస్ మీట్ను మేకర్స్ శనివారం నిర్వహించారు.
సత్య దేవ్ మాట్లాడుతూ,''బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' తర్వాత మా 'రావు బహదూర్' తెలుగు సినిమాకు ప్రతినిధిగా ఉంటుందని చెప్పాను. ఇప్పుడు ఆడియెన్స్ కూడా అదే అంటున్నారు. నేను ప్రతీ సినిమాకి ఇంతే కష్టపడ్డాను. కానీ చాలా వరకు నిరాశే ఎదురైంది. సక్సెస్ అనేది నాకు కొత్త. ఈ సినిమాతో నాకు సక్సెస్ వచ్చింది అని వినడం కంటే.. ఈ మూవీని చూడకపోతే ఆడియెన్స్ ఏదో కోల్పోతారని అనుకున్నాను. ఇలాంటి సినిమా ఆడాలని నేను కోరుకున్నాను. ఇప్పుడు ప్రేక్షకులు మా చిత్రాన్ని భుజానికి ఎత్తుకున్నారు. అమెరికన్స్ ఈ సినిమా గురించి అడుగుతున్నారు. ఇలాంటి ఓ గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్' అని అన్నారు.
'ఈ కథను సత్య దేవ్, అనురాగ్, శరత్ నమ్మడం వల్లే ఇంత వరకు వచ్చింది. వారి వల్లే మూవీ ఈ స్థాయికి వచ్చింది. మేం నమ్మి వేసిన ప్రతీ అడుగు విజయ తీరానికి చేర్చిందిఅని వెంకటేష్ మహా చెప్పారు. చింతా గోపాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ,'మా శ్రమని ఆడియెన్స్ గుర్తించారు. అందరూ మా మూవీని మెచ్చుకుంటున్నారు. ఓ నిర్మాతకు ఇంతకంటే ఏం కావాలి అని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana