Dailyhunt
గుడిపాటి పండరి జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభం

గుడిపాటి పండరి జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభం

వతెలంగాణ - కట్టంగూర్లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ అధ్వర్యంలో గుడిపాటి పండరి జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని శనివారం అధ్యక్షుడు చిక్కుశేఖర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఆటో డ్రైవర్లకు, రిక్షా కార్మికులకు సుమారు 250 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో క్లబ్ కోఆర్డినేటర్ రెడ్డిపల్లి సాగర్, ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, ట్రెజరర్ పోగుల రాములు, ఉపాధ్యక్షులు కల్లూరి వెంకటేశ్వర్లు, సభ్యులు మంగ దుడ్ల శ్రీనివాస్, చిట్టిప్రోలు మురళి, ఐతగోని లక్ష్మి నారాయణ, ఐతగోని సతీష్, జెల్లా అశోక్ ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana