Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గుండూరులో ఉపాధి పనులను పరిశీలించిన ఎంపీడీఓ

గుండూరులో ఉపాధి పనులను పరిశీలించిన ఎంపీడీఓ

వతెలంగాణ - జుక్కల్మండలంలోని గుండూరు జిపి గ్రామం లో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను జుక్కల్ ఎంపిడిఓ శ్రీనివాస్ మంగళవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామంలో నీ పరిధిలోని గ్రామాలలో కూలీల సంఖ్య పెంచాలని అన్నారు. చేతులు స్థాయి పరిశీలనలోకి వెళ్లినప్పుడు కూలీలతో మాట్లాడుతూ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధి పనులకు వచ్చే ప్రతి ఒక్క కూలీలు తన వద్ద ఉల్లిపాయల గడ్డ ఎండ వేడిమికి ఉపశమనంగా తమ జేబులో ఉంచుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో నిర్వహిస్తున్న ఫీడర్ ఛానల్ కాలువ పనును పరిశీలించారని జిపి కార్యదర్శి హరీష్ తెలిపారు.

నిత్యం ఉదయం 6 గంటలకు పని ప్రదేశానికి ఉపాధి కూలీలు రావాలని, ఎండలు రోజు రోజుకు పెరుగుతుండడంతో ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో సమయంలో పనులు చేయకుండా నీడ ప్రాంతంలో రక్షణగా చెట్ల కింద ఉండాలని సూచించారు. పని ప్రదేశంలో త్రాగునీరు, నీడ, హెల్త్ కిట్, ఏర్పాటు చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ వెంకట్ రాథోడ్ ను ఆదేశించారు. అనంతరం కూలీల సంఖ్యను పరిశీలించి హాజరు పట్టికలో చూసి ఒక్కొక్కరిగా హాజరు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణాలను , నర్సరీ , పల్లె ప్రకృతి వనాన్ని , సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాశీనాథ్, ఉప సర్పంచ్, జిపి కార్యదర్శి హరీష్, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకట్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana