Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హార్ముజ్లో జోక్యం వద్దు

హార్ముజ్లో జోక్యం వద్దు

ఫ్రాన్స్, బ్రిటన్కు ఇరాన్ హెచ్చరికటెహ్రాన్ : హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చూసేందుకు ఒమన్తో కలిసి పనిచేస్తామని ఫ్రాన్స్, బ్రిటన్ ప్రకటించడాన్ని ఇరాన్ వ్యతిరేకించింది.

జలసంధి లో సైనిక కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నామని ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కజమ్ ఘరీబబాడీ చెప్పారు. హార్ముజ్లో విదేశీ జోక్యాన్ని అనుమతించబోమని హెచ్చరించారు. 'ప్రాంతీయేతర శక్తుల సైనిక ప్రదర్శనకు హార్ముజ్ జలసంధి థియేటర్ కాదు' అని చురక వేశారు. హార్ముజ్ భద్రతకు ఇరాన్ హామీ ఇస్తుందని, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని తెలిపారు. జలమార్గంలో సైనిక కదలికలను అంగీకరించబోమని స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana