Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్పత్రుల సందర్శన

హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్పత్రుల సందర్శన

- సీఎం సహాయనిధి దరఖాస్తుల సిఫార్సు- స్థానికంగా ఉంటే ప్రజల్లో
ఎమ్మెల్యే జారె ఆదినారాయణ రోజువారీ దినచర్య
నవతెలంగాణ - అశ్వారావుపేట

శ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్థానికంగా ఉన్న సమయంలో నియోజకవర్గంలోని మండలాల్లో ప్రజాప్రయోజన కార్యక్రమాల్లో పాల్గొంటూ, హైదరాబాద్కు వెళ్లిన సందర్భాల్లో నియోజకవర్గ ప్రజలకు వైద్య, సంక్షేమ సేవలు అందేలా ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు.

హైదరాబాద్లో ఉన్న సమయంలో నియోజకవర్గానికి చెందిన రోగులు ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారో తెలుసుకుని వారిని పరామర్శించడం, అవసరమైన వారికి ఉచిత వైద్య సేవల కోసం సిఫార్సులు చేయడం, ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కోసం కొత్త దరఖాస్తులను స్వీకరించడం, ఇప్పటికే సమర్పించిన దరఖాస్తుల మంజూరు స్థితిని తెలుసుకోవడం, మంజూరైన చెక్కులను బాధితులకు అందించడం వంటి కార్యక్రమాలను ఆయన నిత్యకృత్యంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో శుక్రవారం హైదరాబాద్కు వెళ్లిన ఎమ్మెల్యే తెలంగాణ సెక్రటేరియట్లో నియోజకవర్గానికి చెందిన అనారోగ్య బాధితుల నుంచి స్వీకరించిన ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం పొందుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని, అలాగే నిమ్స్ ఆసుపత్రిలో విలువైన వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి వచ్చేలా సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు.

ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన బాధ్యత అని పేర్కొన్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana