హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టులో ఊరట లభించింది.ఎస్.సాంబశివరావు అనే వ్యక్తిపై దాడి చేసి బెదిరించిన అభియోగాలపై 2013లో దానంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ఈ నెల న విచారణ జరిపిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు దానంను దోషిగా తేల్చి ఆరు నెలల జైలు శిక్షతోపాటు వెయ్యి రూపాయల జరిమానా విధించింది. ఈ తీర్పును నాగేందర్ హైకోర్టులో సవాలు చేశారు. విచారించిన జస్టిస్ జి.శ్రీదేవి తాజాగా విచారణ చేపట్టారు. దానంపై విధించిన ఆరు నెలల జైలు శిక్షను అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. బెయిలు సంబంధించి కింది కోర్టు విధించిన షరతులే వర్తిస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

