Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హమాలీ కార్మికులకు మజ్జిగ పంపిణీ

హమాలీ కార్మికులకు మజ్జిగ పంపిణీ

వతెలంగాణ-ఆలేర్ రూరల్ ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలో పి ఏ సి ఎస్ నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రంలో హమాలీ కార్మికుల కోసం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని పరిదే సంతోష్ ప్రారంభించగా.. గ్రామ సర్పంచ్ పరిదే మమత ఆధ్వర్యంలో జరిగింది. ఎండ తీవ్రతలో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ పంపిణీ చేయడం సంతోషకరమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు, కార్మికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ చిన్నం శివకుమార్, ఇంచార్జి మద్దెల సాయికుమార్, రైతులు గవ్వల మల్లయ్య, గవ్వల సాయి మల్లయ్య, హమాలీ కార్మికులు మేకల రాములు, మేకల శ్రీనివాస్, బండ సిద్దులు, బండ మల్లేష్, ఉప్పలి నర్సింహులు, వస్పరి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana