Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హమాస్ సాయుధ విభాగం చీఫ్ మృతి

హమాస్ సాయుధ విభాగం చీఫ్ మృతి

వతెలంగాణ-హైదరాబాద్: హమాస్ సాయుధ విభాగం చీఫ్ ఎజ్జెడిన్ అల్ హదద్ మరణించినట్లు ఇజ్రాయిల్ సైన్యం శనివారం ప్రకటించింది. శుక్రవారం గాజా నగర ప్రాంతంలో జరిపిన వైమానిక దాడిలో ఎజ్జెడిన్ అల్ హదద్ మరణించినట్లు ఐడిఎఫ్ , ఐఎస్ఎ (షిన్ బెట్ దేశీయ భద్రతా సంస్థ) ప్రకటించింది.

అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై దాడికి ప్రణాళిక రచించిన హమాస్ సైనిక విభాగంలోని చివరి సీనియర్ కమాండర్లలో హదాద్ ఒకరని సైన్యం ఆరోపించింది. గాజా నగరంలోని ఒక అపార్ట్ మెంట్, పౌర వాహనంపై శుక్రవారం ఇజ్రాయిల్ జరిపిన దాడిలో హదాద్ మరణించారని ఇద్దరు హమాస్ అధికారులు మీడియాకు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana