Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హనుమాన్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం

హనుమాన్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం

- కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద్ విజయకుమార్- పాల్గొన్న 3 వేల మంది భక్తులు
నవతెలంగాణ-సత్తుపల్లి

సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ అన్నదానాన్ని ప్రారంభించారు. ​ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు హాజరైన దయానంద్ విజయకుమార్ కు ఉత్సవ కమిటీ బాధ్యులు ఘనంగా స్వాగతం పలికి, గణనాధుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

​అనంతరం దయానంద్ విజయకుమార్కు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. ​ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 3000 మంది భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ​గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కమిటీ ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ బాధ్యులు వందనపు సత్యనారాయణ (గ్యాస్), కౌన్సిలర్ హకీం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, మొహమ్మద్ కమల్ పాషా, పద్మ, కాజా కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana