Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు

హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు

నవతెలంగాన-హయత్‌ నగర్‌
అక్రమ సంబంధం అనుమానంతో వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను యల్‌ బి నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం యల్‌ బి నగర్‌ లో ఉన్న సీపీ క్యాంప్‌ కార్యాలయంలో డీసీపీ సన్‌ ప్రీత్‌ సింగ్‌ నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించారు.యూసుఫ్‌ నగర్‌ కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ ముఖీమ్‌ అలియాస్‌ ముఖీమ్‌(20).ఆసీఫ్‌ నగర్‌ కు చెందిన మహ్మద్‌ ఇషాక్‌ అలియాస్‌ ఇషాక్‌ భార్య తో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ముఖీమ్‌ను ఎలాగైనా మట్టుపెట్టాలని భావించి 21-08-2020న ఇషాక్‌ వారి స్నేహితులైన ఆసీఫ్‌ నగర్‌ కు చెందిన మహ్మద్‌ ఇర్ఫాన్‌ అలియాస్‌ అలియాస్‌ ఇర్ఫాన్‌.అభిబ్‌ నగర్‌కు చెందిన రియాజ్‌ ఖాన్లతో కలిసి మల్లెపల్లి వద్ద మద్యం సేవించి తదనంతరం వారి వెంట తెచ్చుకున్న కత్తులతో దాడి చేశారు.తర్వాత సాగర్‌ రింగ్‌ రోడ్డు వద్ద ఉన్న టింబర్‌ డిపో లో పడివేశారు.అక్కడ ఉన్న డిపో యజమాని పిర్యాదు మేరకు కేస్‌ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా హత్యాగా భావించి గురువారం మన్సూరాబాద్‌లో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్టు ఒప్పుకున్నారు.దీనితో వారిని రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.వారి వద్ద నుంచి 4కత్తులు, ఆటో స్వాధీ నం చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో యల్‌ బి నగర్‌ ఏసీపీ పథ్వి ధర్‌ రావు, ఇన్స్పెక్టర్‌ అశోక్‌ రెడ్డి.ఎస్‌ ఐ లు వెంకటయ్య, సుధాకర్‌, సిబ్బంది బీరప్ప, అశోక్‌, దినేష్‌, శ్రీశైలం, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana