Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హెచ్ఐవి సోకిన వారికి సురక్ష తో మౌలిక సేవలు

హెచ్ఐవి సోకిన వారికి సురక్ష తో మౌలిక సేవలు

వతెలంగాణ - కంఠేశ్వర్ : మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష లో భాగంగా డాక్టర్ జయలక్ష్మి జెడి బేసిక్ సర్వీస్, మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష రాష్ట్ర సంయోజక్ ఆది కామేశ్వర రావు నిజామాబాద్ జిల్లా జిజిహెచ్ లో ఉన్న ఏఆర్టి సెంటర్ ను మొదటగా సందర్శించారు.

డాక్టర్స్ అలాగే సిబ్బంది తో మాట్లాడుతూ.. ప్రతి ఒక్క పేషెంట్ కు క్రమం తప్పకుండా మందులు వాడే విధంగా చూడడం అలాగే అర్హులైన వారికి వైరల్ లోడ్ చేయడం, అలాగే వారిని మధ్యలో మందులు మానేయకుండా చూడడం వల్ల వైరల్ లోడ్ తగ్గి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే నిజామాబాద్ 3వ 99 లో ఇంకా 5%గ్యాప్ ను కనక తొందరగా లేకుండా చేస్తే రాష్ట్ర స్థాయిలో బెస్ట్ సెంటర్ గా ఉండే అవకాశం ఉందని అన్నారు. తదుపరి 2వ ఫ్లోర్లో సురక్ష క్లినిక్ ను సందర్శించి ఇలాంటి సుఖ వ్యాధులు వస్తున్నాయి, చికిత్స ఎలా చేస్తున్నారు . గత సంవత్సరం చేసిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తదుపరి మేడమ్ సంపూర్ణ సురక్ష కేంద్రాన్ని సందర్శించి ఏ టీ రిస్క్ కేసులను ఎలా కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఫా ల్లోప్ ఎలా చేస్తున్నారు అడిగి తెలుసుకున్నారు. తదుపరి 7వ ఫ్లోర్ లో ఉన్న ఐ సి టి సి సెంటర్ను సందర్శించడం జరిగింది ఇక్కడ మేడం ప్రతి నెల ఎన్ని పరీక్షలు చేస్తున్నారు ఇంతమందికి పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చినవాళ్లు కి ఎంతమందికి ట్రీట్మెంట్ చేశారు అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.

తదుపరి మేడం జిల్లా వైద్యాధికారిని డా బి రాజశ్రీ ని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో కలవడం జరిగింది . మేడం మాట్లాడుతూ నాలుగు ప్రాథమిక ఆసుపత్రుల్లో ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి హెచ్ఐవి, సిఫిలిస్ హెపటైటిస్ బి పరీక్షలు జరిగే విధంగా చూడమని చెప్పడం జరిగింది అలాగే. వాటిని హెచ్ ఎం ఐ ఎస్ లోనమోదు చేసే విధంగా చూడమని చెప్పడం జరిగింది. తదుపరి డిచ్పల్లిలో ఉన్న మానవతా సదను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ మేడం గారి తో సందర్శించి ఆక్కడ ఉన్న చిన్నారులను కలిసి వారికి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో డా.దేవి నాగేశ్వరీ డి పి ఎం సుధాకర్ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana