Dailyhunt
హెన్రీ వర్డియర్తో కేటీఆర్ సమావేశం

హెన్రీ వర్డియర్తో కేటీఆర్ సమావేశం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
ఫ్రాన్స్‌ పర్యటనలో భాగంగా బుధవారం తొలిరోజున మంత్రి కేటీఆర్‌ ఫ్రెంచ్‌ ప్రభుత్వ డిజిటల్‌ అఫైర్స్‌ అంబాసిడర్‌ హెన్రీ వర్డియర్‌తో సమావేశం అయ్యారు.

ఇన్నోవేషన్‌, డిజిటైజేషన్‌, ఓపెన్‌ డేటా అంశాల్లో ఫ్రాన్స్‌, తెలంగాణ మధ్య పరస్పర సహకారం అందించుకునే అవకాశం గురించి వారివురు చర్చించారు. రాష్ట్రంలో ఇన్నోవేషన్‌, అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి జరుగుతున్న వివిధ కార్యక్రమాలు ఓపెన్‌ డేటా పాలసీ, నిర్మాణంలో ఉన్న డిజిటల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ గురించి కేటీఆర్‌, వర్దియర్‌కు వివరించారు. అటు తెలంగాణలోని అంకుర సంస్థలకు ఫ్రాన్స్‌లో, ఇటు ఫ్రాన్స్‌లోని అంకుర సంస్థలకు తెలంగాణలో వ్యాపార, వాణిజ్య అవకాశాలు కల్పించడంపై కూడా వారి మధ్య చర్చ జరిగింది. సమావేశంలో ఫ్రాన్స్‌లో భారత డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ కే.ఎం. ప్రఫుల్ల చంద్ర శర్మ, తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, డైరెక్టర్‌ డిజిటల్‌ మీడియా కొణతం దిలీప్‌, డైరెక్టర్‌ ఏవియేషన్‌ ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana