Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హిందీ తెలియదంటే ఇండియన్ కాదా?

హిందీ తెలియదంటే ఇండియన్ కాదా?

- విమానాశ్రయంలో కనిమొళికి చేదు అనుభవం
- సీఐఎస్‌ఎఫ్‌ అధికారిపై ఎంపీ ఆగ్రహం
న్యూఢిల్లీ: డీఎంకే నేత, లోక్‌సభ ఎంపీ కనిమొళి కరుణానిధికి విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. మీరు ఇండియన్‌ అవునా కాదా అని సీఐఎస్‌ఎఫ్‌ మహిళా అధికారి ఒకరు ఆమెను ప్రశ్నించారు. తమిళంలో కానీ, ఇంగ్లీషులో కానీ మాట్లాడమని కనిమొళి అన్నప్పుడు.. ఆ మహిళా అధికారి ఈ ప్రశ్న వేశారు. దీనిపై కనిమొళి ట్వీట్‌లో తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆదివారం ఒక సీఐఎస్‌ఎఫ్‌ అధికారి విమానాశ్రయంలో తారసపడ్డారు. నాకు హిందీ తెలియదని చెబుతూ తమిళంలో కానీ, ఇంగ్లీషులో కానీ మాట్లాడమని కోరాను. మీరు భారతీయురాలా అని ప్రశ్నించింది.

నేను ఒక విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. హిందీ తెలిసి ఉంటేనే ఇండియనా? హిందీకి సమానార్థం ఇండియనా?' అని కనిమొళి ఆ ట్వీట్‌లో ప్రశ్నించారు. 'హిందీ ఇంపొజిషన్‌' అంటూ తన ట్వీట్‌కు హ్యాష్‌ ట్యాగ్‌ కూడా ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana