నవతెలంగాణ - రాజన్న సిరిసిల్ల : జిల్లా పోలీస్ కార్యాలయంలోని డిసిర్బీలో విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన హోమ్ గార్డ్ దేవయ్య యాక్సిస్ బ్యాంక్ లో సాలరీ అకౌంట్ ఉండగా మంజూరు అయిన రూ.
30 లక్షల ఇన్సూరెన్స్ చెక్ యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యం జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే చేతుల మీదుగా దేవయ్య కుటుంబ సభ్యులకు అందించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసిన హోమ్ గార్డ్ దేవయ్య మరణం పోలీస్ శాఖకు తీరని లోటని,దేవయ్య కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. పోలీస్ సిబ్బంది, హోమ్ గార్డులు తమ విధులను నిర్వర్తించే సమయంలో భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు, ఆర్.ఐ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

