Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హృదయ విదారక ఘటన..కాడెద్దుగా మారిన తమ్ముడు

హృదయ విదారక ఘటన..కాడెద్దుగా మారిన తమ్ముడు

వతెలంగాణ - బయ్యారం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో ఓ రైతు కుటుంబం ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితి ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.

మూడు రోజుల క్రితం విద్యుత్ షాక్కు గురై రైతు పెనుక పాపారావుకు చెందిన రెండు కాడెద్దులు, ఒక ఆవు దూడ, ఒక మేక మృతి చెందాయి.

ఈ ఘటనతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిన పాపారావుకు కొత్త కాడెద్దులను కొనుగోలు చేసే స్థోమత లేకపోగా, ట్రాక్టర్తో పొలం దున్నించే పరిస్థితి కూడా లేదు. దీంతో వ్యవసాయ పనులు నిలిచిపోకుండా ఉండేందుకు మిగిలిన ఒక్క కాడెద్దుకు జతగా తన తమ్ముడు పెనుక ప్రవీణ్ను కాడెద్దు స్థానంలో ఉపయోగిస్తూ నాగలితో పొలం దున్నడం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. ఈ హృదయ విదారక దృశ్యం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana