Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇక కేరళంలో ఫ్రీ బస్సు

ఇక కేరళంలో ఫ్రీ బస్సు

వతెలంగాణ-హైదరాబాద్: కేరళం సతీశన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రీ బస్సు పథకానికి శ్రీకారం చుట్టింది. మంత్రి వర్గ తొలి సమావేశంలో మహిళాందరికీ ఉచిత బస్సు పథకానికి ఆమోద ముద్ర వేసింది.

ఈ పథకం వచ్చే నెల జూన్ 15నుంచి అమలోకి రానుందని మీడియా సమావేశంలో సీఎం సతీశన్ వెల్లడించారు. ఎన్నికల హామీలో భాగంగా మహిళాల సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలియజేశారు. గత నెల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధిక స్థానాలు కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్నాటక, తెలంగాణల్లో ఉచిత బస్సు పథకం అమల్లో ఉంది.

కాగా కేరళం రాష్ట్ర ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణం చేశారు. సతీశన్తో గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు, ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. సతీశన్ ప్రభుత్వంలో మంత్రులుగా 21 మంది ప్రమాణం చేశారు. కున్హల్కుట్టి, మురళీధరన్, షాజీ, అబ్దుల్ గఫర్, బషీర్, మోన్స్ జోసెఫ్.. ఇతరులు ఉన్నారు. అలాగే ఆయన కేబినెట్లో ఇద్దరు మహిళలకు చోటు లభించింది. తులసి, బిందు కృష్ణలు మంత్రులుగా ప్రమాణం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana