Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంటర్ పాఠ్యపుస్తకాల్లో మార్పులు.!

ఇంటర్ పాఠ్యపుస్తకాల్లో మార్పులు.!

కొత్త సిలబస్, డిజిటల్ బోధననవతెలంగాణ - మల్హర్ రావు

ఇంటర్ విద్యలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ కీలక నిర్ణ యాలు తీసుకుంది.

పాఠ్యపుస్తకాలు, డిజిటల్ బోధన పద్ధతులు అమలు చేయనుంది. ఇంటర్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఆధారిత విద్యపై అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇంటర్మీడియెట్ స్థాయిలో ఏఐ బోధన ద్వారా ఇంజినీరింగ్లో చేరే విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనం కలుగనుంది. ఉన్నత విద్యతోపాటు భవిష్యత్లో ఉద్యోగ అవకాశాలకు పునాది పడనుంది. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన డీఆర్పీలు అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నారు.

మారిన సిలబస్లో కెమిస్ట్రీ, హిస్ర్తి, ఏకనామినామిక్స్ సబ్జెక్టుల్లో తీసివేసిన, కొత్తగా పాఠ్యాంశాలను ఎలా బోధించాలో అవగాహన కల్పించనున్నారు. క్లాసూమ్లలో టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) సాధనాలు, డిజిటల్ పద్ధతులను ఉపయోగించి పాఠాలను ఆకర్షణీయంగా ఎలా చెప్పాలో శిక్షణ ఇస్తారు. 2026-27 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే నూతన అసెస్మెంట్, పరీక్షల ప్యాట్రన్పై స్పష్టతనిస్తారు. కేవలం సబ్జెక్టు బోధన మాత్రమే కాకుండా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పొందేలా గైడెన్స్ ఇచ్చేందుకు మాస్టర్ ట్రైనర్లను సిద్ధం చేయనున్నారు.

పాఠ్యoశాల్లో మార్పులు..
ఇంటర్మీడియెట్ తెలుగు పుస్తకాన్ని మొత్తం మార్చేశారు. సబ్జెక్టుల వారీగా అనేక మార్పులు చేశారు. జంతుశాస్త్రంలో ప్రోటోజోవాలో గమనం, ప్రత్యుత్పత్తి తొలగించగా.. ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్క 15 మార్కులు, భౌతిక శాస్త్రంలో ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ చేర్చడంతో పాటు ప్రాక్టికల్స్కు 15 మార్కులు, వృ క్షశాస్త్రంలో ఆర్థిక వృక్షశా స్థం చేర్చి ప్రాక్టికల్స్క 15 మార్కులు కేటాయించారు. గణితంలో అనుక్రమాలు, శ్రేణులు, సమితుల సిద్ధాంతం అధ్యాయాలు చేర్చారు. రసాయనశాస్త్రంలో పదార్థాల స్థితులు, పర్యావరణ రసాయన శాస్త్రం, స్టోయికియోమెట్రీ పాఠంలో మెలారిటీ భావన తొలగించారు.

మొదటి సంవత్సరం ప్రాక్టీకల్ పరీక్షల కోసం క్వాలిటేటివ్ అనాలసిస్ నుంచి 15 లవణాలు కొత్తగా చేర్చారు. హిస్టరీలో యూనిట్-6లో దక్షిణ భారతదేశం, దక్కమ్రాజ్యాలు, యూనిట్-8లో ప్రాంతీయ రాజ్యాలు కొత్తగా చేర్చగా మరాఠాలు, ప్రాంతీయ శక్తుల ఎదుగుదల తొలగించారు. సుల్తానేట్ రాజవంశీయుల అంశం యూనిట్-7లో కలిపారు. యూరోపియన్ల రాక, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తొలి తిరుగుబాటు, జాతీయోద్యమం (తొలి దశ, మలిదశ) యూనిట్లు విలీనం చేశారు. ఎక నామిక్స్లో పాజిటివ్ ఎకనామిక్స్, నార్రేటివ్, నార్మేటివ్ ఎకనామిక్స్ చేర్చారు. స్టాటిస్టిక్స్ సూచీ సంఖ్యలు కొత్తగా చేర్చారు. తెలుగులో పాఠ్యాంశాలు మార్పులు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana