Wednesday, 20 Jan, 9.45 am నవ తెలంగాణ

హోం
ఇంటర్ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

హైదరాబాద్: ఇన్ని రోజులు కరోనా మహ్మరి కారణంగా ఆన్‌లైన్ క్లాసులు జరిగాయి. ఇప్పుడు రెగ్యులర్ తరగతులు నిర్వహించడంపాటూ ఎగ్జామ్స్ కూడా జరిపేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. "ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలపై విద్యార్థులకు ఓ వారంలో స్పష్టత ఇస్తాం. అలాగే సిలబస్, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అన్నింటిపైనా వారంలో క్లారిటీ ఇస్తాం" అని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి మంత్రి విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ, ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్యాలతో ఓ సమావేశం ఏర్పాటుచేశారు. విద్యాసంస్థలను ఎప్పుడు తెరవాలనే అంశంపై చర్చించారు. స్కూళ్లలో రెగ్యులర్ తరగతులు తప్పనిసరి కాదన్న ఆమె... ఫీజులకు సంబంధించి జారీ చేసిన జీవో 46ని ప్రేవేట్ స్కూళ్ల యాజమాన్యాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. "మేం వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోవచ్చు కానీ క్రమంగా ఆ స్కూళ్లపై చర్యలు ఉంటాయి" అని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఫీజుల అతిక్రమణకు సంబంధించి కోర్టులో 12 స్కూళ్ల కేసులు ఉన్నాయని తెలిపారు.
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఏప్రిల్‌లో ప్రారంభం అవుతాయని ఇటీవల బోర్డు ప్రకటించింది. ఏప్రిల్ చివరి వారంలో పరీక్షలు ప్రారంభమై మే మధ్య వరకు జరుగుతాయని తెలిపింది. పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన డేట్స్ త్వరలో ప్రకటిస్తామంది. దీనిపై ప్రభుత్వం వారంలో క్లారిటీ ఇవ్వనుంది. ఈ పరీక్షల్లో 70 శాతం కరిక్యులమ్ ద్వారా ఉంటుందనీ మిగిలినది ప్రాజెక్టు, అసైన్‌మెంట్ల ద్వారా ఉంటుందని చెప్పింది. విద్యార్థులకు ఎక్కువ ఆప్షన్లు ఉంటాయి. గతంలో ఇచ్చినట్టు ఐదు ప్రశ్నల్లో మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయండి తరహాలో కాకుండా ఏడు ప్రశ్నలు ఇచ్చి వాటిలో మూడింటికి ఆన్సర్లు రాయండి అనేలా ఉంటుందని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ముందు నిర్వహిస్తారు. ఆ తర్వాత ధియరీ పరీక్షలు నిర్వహిస్తారు. వీటిపై స్పష్టమైన షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని బోర్డు అధికారి చెప్పారు. ఎగ్జామ్ ఫీజు ఎంత అనేది తెలంగాణ ఇంటర్ బోర్డు త్వరలో ప్రకటించనుంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top