Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంటింటికీ బీఎల్ఓలు..

ఇంటింటికీ బీఎల్ఓలు..

- ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం- వచ్చే నెల 24 వరకు కొనసాగనున్న సర్వే
- అధికారులకు సహకరించాలి
- అమీన్పూర్ తహసీల్దార్ వెంకటేష్, డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్

నవతెలంగాణ- అమీన్పూర్: అమీన్పూర్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఊపందుకుంది. ఈ నెల 20వ తేదీ నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం వచ్చే నెల 24వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రతి పోలింగ్ బూత్ పరిధిలోని బూత్ స్థాయి అధికారులు తమ పరిధిలోని ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లి ఓటరు నమోదు, సవరణలకు సంబంధించిన ఫారాలను పంపిణీ చేస్తున్నారు. గురువారం జరిగిన కార్యక్రమంలో భాగంగా, జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని పటేల్గూడలో బీఎల్ఓలు ముమ్మరంగా పర్యటించారు.

ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు అవసరమైన ఫారాలను అందజేశారు. అనంతరం ప్రజల నుండి సేకరించిన సమాచారాన్ని, వివరాలను బీఎల్ఓలు తమ మొబైల్లో ప్రత్యేకంగా రూపొందించిన యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా అమీన్పూర్ తహసీల్దార్ వెంకటేష్, డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ పలు పోలింగ్ బూత్లను స్వయంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వే ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించారు. బీఎల్ఓలకు పలు సూచనలు చేశారు.

'గురువారం నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. మీ పోలింగ్ బూత్ల పరిధిలో మీ ఇళ్లకు వచ్చే బీఎల్ఓలకు ప్రజలందరూ పూర్తి స్థాయిలో సమాచారం అందించి సహకరించాలి.' అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి మనోహర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana