Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IPL-2026: ముగిసిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం

IPL-2026: ముగిసిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం

వతెలంగాణ - హైదరాబాద్ : ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం ముగిసింది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన కీలక మ్యాచ్లో 89 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలై ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.

అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ విజయంతో గుజరాత్ ప్లే ఆఫ్స్లో టాప్-2 స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు శుభ్మన్ గిల్ (37 బంతుల్లో 64), సాయి సుదర్శన్ (53 బంతుల్లో 84) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 125 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన జాస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 27 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించింది.

230 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ ఆది నుంచే తడబడింది. ఇన్నింగ్స్ తొలి బంతికే సంజూ శాంసన్ డకౌట్ అయ్యాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (16) మెరుపులు తాత్కాలికమే అయ్యాయి. మహమ్మద్ సిరాజ్ తన తొలి ఓవర్లలోనే కీలక వికెట్లు పడగొట్టి చెన్నైని కోలుకోలేని దెబ్బ తీశాడు. శివమ్ దూబే (17 బంతుల్లో 47) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో చెన్నై 13.4 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడ, రషీద్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana