Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇప్పలపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఇప్పలపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

వతెలంగాణ - మల్హర్ రావుమండలం ఇప్పలపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ అబ్బినేని లింగస్వామి, ఉప సర్పంచ్ అక్కల దేవేందర్, పిఏసిఎస్ సిఈఓ సంతోష్ మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. తేమ 17 శాతం మించకుండా పాక్యూ వచ్చిన తరువాత టోకెన్ తీసుకొని విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు, హమాలి కార్మికులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana