Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇస్రోకు బాంబు బెదిరింపు కాల్

ఇస్రోకు బాంబు బెదిరింపు కాల్

వతెలంగాణ-హైదరాబాద్: కర్నాటక బెంగుళూర్ లోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు సోదాలు చేపట్టారు.

తనిఖీల్లో ఎలాంటి బాంబు ఆనవాళ్లు కన్పించకపోవడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు. ఇస్రో అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని పోలీసులు ఈ ఘటనపై మరింత దర్యాప్తు చేపట్టారు.

ఉత్తర బెంగళూరు డీసీపీ బాబాసబ్ నెమగౌడ మీడియాతో మాట్లాడుతూ. ..మధ్యాహ్నం సమయంలో, సంజయ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. తమ అధికారులు వెంటనే ఇస్రోకు చేరుకుని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇస్రో అధికారులు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ బూటకపు కాల్ నేపథ్యంలో తలెత్తిన భద్రతాపరమైన ఆందోళనలపై కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. ఇటువంటి ఘటనల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana